భారత దేశంలో మొట్ట మొదటి సారి సెన్సెక్స్ 60,000 మార్క్ దాటింది . గత 2 సంవత్సరాలు నుంచి భారత దేశంలో కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్యా క్రమంగా పెరుగుతుంది .ట్రేడర్ల సంఖ్యా 10 కోట్లకు చేరుకుంటుంది .ఇది చాలా మంచి పరిణామం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు .
ఇంతకముందు సుమారు 40 పేపర్ లో ని సంతకాలతో ,బ్రోకర్ సహయంతో అకౌంట్ తెరిచే ప్రక్రియ ఉండేది . ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ చాలా సులభం అయిపోయింది . ఇప్పుడు అకౌంట్ తెరవడానికి సులభంగా ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ లోనే అప్లోడ్ చేయవచ్చు .కానీ ప్రస్తుత ఆర్థిక మోసాల రిత్యా అకౌంట్ తెరవడానికి కొంత దాని గురుంచి తెలుసుకోవాలని ,ఏ ఆన్లైన్ వేదిక మంచిదో సూక్ష్మంగా పరిశీలించి డీమ్యాట్ అకౌంట్ తెరవడం మంచిదని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . ఇందులో కూడా షేర్ మార్కెట్ లు బాగా పరిశీలన చేసి ఇన్వెస్ట్ చేయడం మంచిదని కూడా అభిప్రాయపడుతున్నారు.
వాసకి
