రిపబ్లిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయిన పవన్ కళ్యాణ్ వివిధ సినిమా మరియు రాజకీయ విషయాలు గురుంచి మాట్లాడారు.సుమారు గంట సేపు ఆవేశితపూర్వ ప్రసంగం చేశారు .
సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర లో ఎదురుకుంటున్నా సమస్యలు గురుంచి చెప్పారు . టికెట్ వెల పెంపు విషయాలు ,ఆంధ్ర లో గవర్నమెంట్ అనుకుంటున్నా ఆన్లైన్ టికెట్ ప్లాటుఫార్మ్ గురుంచి మాట్లాడారు . సినీ పెద్దలు ఎవరిని బ్రతిమాల్సిన అవసరం లేదని తమకు దక్కాల్సిన హక్కులను గట్టిగ అడగాలని సూచించారు .
దిల్ రాజు తానూ రెడ్డి కులస్థుడిగా ఆంధ్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెమత్కరించారు .
మా ఎన్నికలు గురుంచి కూడా మాట్లాడారు . ప్రకాష్ రాజ్ ని నాన్ -లోకల్ గ సంబోధించడం మంచి పద్దతి కాదని ,తానూ ప్రకాష్ రాజ్ మిత్రులు కారని,అలా ఆనడం మాత్రం సబబు కాదు అని అన్నారు . ప్రముఖ నటుడు మోహన్ బాబు ని కూడా ఏ .పి లోని సమ్యలకు దారి చూపాలని కోరారు .
నటుడు నాని గురుంచి మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం నాని మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని , ధైర్యం ఉంటె గవర్నమెంట్ ని ప్రశ్నించాలని కోరారు .
మీడియా కూడా నటుడు సాయి ధరమ్ తేజ్ కి జరిగిన ఆక్సిడెంట్ ని వదిలి ఆంధ్ర లో ఉన్న సమస్యలు గురుంచి మాట్లాడమని సూచించారు.
వాసకి
