ముంబై ఇండియన్స్ విల విల

ఐపీల్ చరిత్రలో ఎంతో విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో లో బాగా తీసికట్టుగా ఆడుతోంది . ఆ టీమ్ లో ఒకరు కూడా ఫామ్  లో లేరు . ఆ టీం లోని చాల మంది జరగబోయే టీ 20 వరల్డ్ కప్ కి  సెలెక్ట్ అయినా వారు ఉన్నారు . కానీ రెండో దఫా ఐపీల్ సీజన్లో ఈ సారి దుబాయ్ వేదికగా జరుగుతున్నా నేపథ్యం లో సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ ,హార్దిక్ పాండ్య ,రోహిత్ శర్మ ,కృనల్ పాండ్య ఇలా ఒక పెద్ద జాబితేనే ఉంది. ఒకరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు . 

                                                                                                                అతి విశ్వాసమో , అజాగ్రత్తనో తెలీదు  కానీ ఈ సారి ముంబై ఇండియన్స్ తేలిపోయింది . హార్దిక్ పాండ్య ఫిటినెస్ మీద చాల సందేహాలు నెలకున్నాయ్ . ఒకప్పుడు విస్వసించదగ్గ అల్ రౌండర్ గ పేరు తెచ్చుకున్నా అతను మొదటి కొన్ని మ్యాచ్ల్లో ఆడలేదు . మాజీల విమర్శల నేపథ్యంలో అతను తర్వాత ఆడినా  స్టాయ్ కి తగ్గ ఒక ఇన్నింగ్స్ ఆడలేదు . బౌలింగ్ చేయకుండా బ్యాట్సమెన్ గానే అతను కొనసాగుతున్నాడు . ఇలానే కొనసాగితే అతను మున్ముందు భారత జట్టు లో ఆడటం కష్టమేమో . గత సీజన్లో లో ఒక వెలుగు వెలిగిన సూర్య కుమార్ యాదవ్,ఇషాన్ కిషన్ గురుంచి ఎంత తక్కువ  చెప్పుకుంటే అంత మంచిది.రెండకల స్కోర్ చేయనడానికి కూడా బాగా కష్టపడుతున్నారు . ఇషాన్ కిషన్ ఇప్పటికె జట్టు లో చోటు కోల్పాయాడు .టెక్నిక్ పరంగా కోహ్లీ కి సామానుడుగా అనుకుంటున్నా సూర్య కుమార్ కూడా ఫార్మ్ లో లేడు .పేలవ షాట్ లకు అవుట్ అవుతున్నాడు . ఇప్పటికే ఐపీల్ ప్రతిభ ఆధారంగా టీ 20 కూర్పు మారవచ్చని ప్రకటించిన బీసీసీఐ ఈ ఆటగాళ్ల మీద వేటు వేయవచ్చు .ఆలా జరగకుండా తమ మిగిలిన మ్యాచ్ల్లోనైనా తమ సత్తా చూపుతారని ఆశిద్దాం ..                                     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *