సయిద్ ముస్తక్ అలీ ట్రోఫీ టైటిల్ పోరులో కర్నాటక , తమిళనాడు మధ్య జరిగిన హోరాహోరి పోరు లో తమిళనాడు గెలిచింది. తమిళనాడు గెలవాలంటే చివరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సివచ్చింది . ఈ సమయంలో కర్ణాటక చాలా కట్టడిగా బౌలింగ్ చెయ్యసాగింది.
టోర్నమెంట్ మొత్తం బంతి తో రాణించిన తమిళనాడు ఆటగాడు సాయి కిషోర్ బ్యాట్ తోను రాణించి, చివరి ఓవర్ లో బౌండరీ తో మ్యాచ్ తమిళనాడు వైపు తిప్పిన మళ్ళి ప్రతీక్ లయ పుచుకున్నాడు. కానీ అప్పటికే మంచి ఊపు మీదున్నా షారుఖ్ ఖాన్ ప్రతీక్ జైన్ వేసిన చివరి బంతికి సిక్స్ కొట్టి తమిళనాడు ని గెలిపించాడు. దీంతో ఢిఫెండింగ్ ఛాంపియన్ తమిళనాడు మళ్ళి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ట్రోఫీ తో సయిద్ ముస్తక్ అలీ చరిత్రలో తమిళనాడు కు మూడు ట్రోఫీ లు వచ్చాయి .
వాసకి
