హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుదల!

Hyderabad Cold Weather

దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఈశాన్య గాలులు బలహీనపడుతుండటంతో, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ మొత్తంగా కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలువగా , శేరిలింగంపల్లి లో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా నమోదైంది.
తక్కువ గాలుల దిశలో మార్పు కారణంగా హైదరాబాద్‌లోనే కాకుండా మొత్తం తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌, అల్వాల్‌, బేగంపేట, జూబ్లీహిల్స్‌, కార్వాన్‌, బేగంపేటలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. మరోవైపు హైదరాబాద్‌కు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *