సుప్రసిద్ధ గీతా రచయిత “సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ” ఇక లేరు !

Sirivennala seetharama shastry

తెలుగు వారందరికీ ప్రీతి పాత్రుడైన వ్యక్తి ,తన పాటలతో అందరి ఆలోచలను ఎంతో కొంత ప్రభావితం చేసిన వాడు సిరివెన్నెల గారు .సంగీత ప్రియులను ఎంతో అలరించిన “సిరి వెన్నల” చిత్రం అతనికి ఇంటి పేరు గ మారింది . సిరి వెన్నెల చిత్రం లోని “ఆది భిక్షవు” పాట ఎప్పటికి గుర్తుండిపోయే పాట ,ఆ పాట ఒక్క మచ్చుతునక మాత్రమే . ఆది భిక్షవు పాట ఆయనకి మొదటి నంది అవార్డు తెచ్చిన చిత్రం . శ్రుతిలయలు లోని “తెల్లవారింధో స్వామి”,మేఘ సందేశం “లోని ఈ గాలి ఈ నెల” ,గమ్యం ” లోని ఎంత వరకు ఎందు కొరకు “లాంటి పాటలు చిరస్మరణం .
1955 లో అనకపల్లె లో పుట్టిన ఆయన గీత రచయితగా తన ప్రస్థానం సిరి వెన్నల తో మొదలు పెట్టారు ,ఆయన ఆ తరానికి ,ఈ తరానికి చెరగని ముద్ర వేసిన వారు . ఈ తరానికి బలుపు లోని “ఏవైందో “,అలా వైకుంఠపురం లోని “సామాజవరగమన ” లాంటి పాటలు ఆయన విశాల భావ సారూప్యానికి నిదర్శనం .దర్శకుడు విశ్వనాధ్ గారి చిత్రాలు సిరివెన్నెల , శ్రుతిలయలు , స్వయంకృషి , స్వర్ణ కమలం ఆపద్భాందవుడు , స్వాతి కిరణం , శుభ సంకల్పం మొదలైనవి ఆయనకి చాల పేరు తెచ్చి పెట్టాయి . సిరివెన్నెల గారిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి విశ్వనాధ్ గారు .
ఆయన రెండు సంవత్సరాలు నుండి లంగ్ కాన్సర్ తో బాధ పడుతున్నారు ,ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయింది ,చికిత్స తీసుకున్నా మళ్ళి కాన్సర్ తిరగ బెట్టడంతో సర్జరీ చేయించుకున్నారు , కొద్దీ రోజులకే నిమోనియా ఇన్ఫెక్షన్ సోకి శరీరం మొత్తం వ్యాపించి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి .దీంతో అయన తుది శ్వాశ విడిచారు . ఏది ఏమైనా సిరివెన్నెల గారు లేకపోవటం తెలుగు బాషా కి తీరని లోటు ,అయినా కూడా ఆయన పాటలతో ఎప్పటికి గుర్తుండి పోతారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *