భారతదేశంలో 220 ఓమిక్రాన్ కేసులు దాటిన నేపథ్యంలో , AIIMS డైరెక్టర్ జాగ్రత్తగా ఉండాలని మరియు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. టీకాలు వేయించుకోవడం మరియు కోవిడ్ నియమాలను పాటించడమే ఓమిక్రాన్ కేసుల సంఖ్యను తగ్గించగలవని ఆయన సూచించారు.
నిన్నటి రోజు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఓమిక్రాన్ తో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది..
ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌లు మనల్ని రక్షించగలవని, అయితే పూర్తి రక్షణ కోసం రెండో తరం టీకాలు అవసరమని కూడా ఆయన పేర్కొన్నారు. ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండే బైవాలెంట్ వ్యాక్సిన్‌లను పొందడానికి ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లను సర్దుబాటు చేయవచ్చని ఆయన అన్నారు.
గురువారం పి.ఎం మోడీ కోవిడ్ 19 సమీక్ష సమావేశం. .
డెల్టా కంటే ఓమిక్రాన్ మూడు రెట్లు ఎక్కువ విస్తరించే అవకాశం ఉనందున , ఇప్పటికే రాష్ట్రాలు మరియు యుటిలను హెచ్చరించింది. రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో త్వరిత విశ్లేషణ మరియు సత్వర నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది.
తెలంగాణలో హై అలర్ట్.
తెలంగాణకు చెందిన ఓంకాలజిస్ట్ ఓమిక్రాన్ పాజిటివ్ అని నిర్దారణ అయింది , అతను విదేశీయులకు చికిత్స చేయడం వల్ల అతనికి వ్యాధి సోకిందని అనుకుంటున్నారు . అతనితో పరిచయం ఉన్న వ్యక్తులను కనుగొనడానికి తెలంగాణ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.