హత్య కేసులో ఇరుక్కున్న నరేష్ అగస్త్య (కృష్ణ) యొక్క దురదృష్టంతో చిత్రం ప్రారంభమవుతుంది, అతను తరువాత పోలీస్ అవుతాడు . కథ ,కృష్ణ మరియు కృష్ణ మూర్తి (రాజేంద్ర ప్రసాద్) చుట్టూ తిరుగుతుంది. రాకేందు మౌళి మరియు జోష్ రవి తమ తమ పాత్ర మేర నటించారు . సీనియర్ పోలీస్‌గా నటించిన హర్షవర్ధన్ సముచితం.
రాజేంద్ర ప్రసాద్ నెగిటివ్ షేడ్‌లో కనిపిస్తాడు మరియు అతను ఈ పాత్రకు సరిపోకపోవచ్చు అన్న భావన కలుగుతుంది .సినిమా సాగుతున్న కొద్దీ ఆయనను ఎందుకు ఎంపిక చేశారో అర్థమవుతుంది. అతను చేసిన భావోద్వేగ భాగాలు అత్యున్నతమైనవి. కొన్ని భాగాలకు నరేష్ అగస్తయ్య, జ్ఞానేశ్వరి కెమిస్ట్రీ వర్క్ చేసినా అనుకున్న స్థాయిలో కుదరలేదు. రాజేంద్ర ప్రసాద్ తన భార్య గురించి చాలా ఉద్వేగభరితంగా వివరించడం ,ఎంతో భావోద్వేగం పండించిన ఆ సీన్ తరువాత అకస్మాత్తుగా కృష్ణ జ్ఞానేశ్వరి ని కౌగిలించుకోవడం అర్థరహితం . రాజేంద్ర ప్రసాద్ తన గ్యాంగ్‌లోని కొందరిని కాల్చి చంపే సన్నివేశాలు చాలా రసవత్తరంగా ఉంటాయి .
రాజేంద్ర ప్రసాద్ ఎంటర్ అయ్యాక సినిమా రేసీగా ఉంది, ఇది ఏద్గె అఫ్ సీట్ సీట్ థ్రిల్లర్ అని మనం చెప్పలేము. కానీ ఇది ఖచ్చితంగా కొన్ని ఉత్కంఠభరితమైన క్షణాలను కలిగి ఉంటుంది, దానిని మిస్ చేయలేము.
చివరి గమనిక : భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్ సినిమా