
ఎన్నో రోజులు నుండి మీడియా లో ఉన్న పుకారు నిజం అయింది . సమంత,నాగ చైతన్య సామజిక మాద్యమం ఇంస్టాగ్రామ్ వేదికగా తమ బంధం గురుంచి ప్రకటించారు .ఇద్దరు ఒకే రకమైన పోస్ట్ పెట్టారు . 4 సంవత్సరాల తమ వైవిహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ,10 సంవత్సరాల తమ స్నేహాన్ని కొనసాగిస్తామని ,ఇది తమ వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు .దీంతో ఇరు నటుల అభిమానులు విస్మయానికి లోనయ్యారు .
నాగార్జున కూడా వారు విడిపోవడం చాలా బాధాకరం అని ,కానీ ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు . ఏది ఏమైనా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో తన పేరు ను “S ” అని మార్చిన నుంచి వారి ఇద్దరి మధ్య దూరం కాబోతున్నారని పుకారు లేచింది . కాని తాను చేస్తున్న శాకుంతలం సినిమా గురుంచి ఆలా పెట్టుకున్నారేమో అని అనుకున్నారు . కానీ ,అలా కాకుండా ఎంతో ఆక్టివ్ గ ఉండే సమంత నాగ చైతన్య గురుంచి కానీ ,తన సినిమా గురుంచి కానీ ఎలాంటి పోస్ట్లు ఇటీవల పెట్టలేదు . ఈ మధ్య మళ్ళి ఈ వివాదం సద్దుమణిగిందని అందరు అనుకున్నారు .ఇంతలో ఏదో ప్రకటన ఈ రోజు రాబోతుంది అనే తరుణంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు .
వాసకి