తెలంగాణలోని ఇబ్బడి ముబ్బడి గ వెలిసిన ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడుతున్నాయి .ఒకప్పుడు 400 వరకు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడు 175 కి చేరుకుంది . ఇందులోనూ CSE మరియు ECE కి మాత్రమె గిరాకీ ఉంది .
చాలా జిల్లాలో పదుల సంఖ్యకి కళాశాలలు చేరుకున్నాయ్ . ఒక్క హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్క కళాశాలలో చదవడానికి ఇష్టపడుతున్నారు . ఎలాగూ ఉద్యోగం వచ్చాక ఇక్కడే స్థిరపడతాం అనే ధోరణితో రాజధాని ప్రాంతానికి తల్లిదండ్రులు కూడా ఇష్టం ప్రదర్శిస్తున్నారు . ఇలాగే కొనసాగితే జిల్లాలో చాలా కళాశాలలు మూతపడే సూచనలు కనిపిస్తున్నాయ్ .ఇంతక ముందు నేషనల్ బోర్డు అఫ్ అక్రెడియేషన్ 120 సీట్లు కు మాత్రమే ఒక్క బ్రాంచ్ కి అనుమతి ఉండేది .ఇప్పుడు ఈ సంఖ్యా కొన్ని కళాశాలలో 1000 సీట్లు దాకా ఉంటున్నాయి . దీని వల్ల జిల్లా లో కళాశాలలు వెలవెలబోతున్నాయి. ఈ అంశాన్ని పరిశీలంచాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు .
వాసకి
