కొత్త సంవత్సరం మరియు రాబోయే పండుగల సమయంలో ప్రజలు సరైన కోవిడ్ నిబంధలను కొనసాగించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. సరైన కోవిడ్ నిబంధలను పాటించడం మరియు టీకాలు వేయడం వల్ల ఓమిక్రాన్ నుండి ప్రజలను రక్షించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.
70% కేసులు లక్షణరహితమైనవి ,అయినా భారీ స్థాయిలో కేసులు పెరగవచ్చు . ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
దేశానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహమ్మారి ముగియలేదని, కానీ మెరుగైన స్థితిలో ఉన్నామని అన్నారు.
జనవరి 2022 నాటికి కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌లోని కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సమిత్ చెప్పారు.
దక్షిణాఫ్రికా నుండి ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించిన మొదటి వ్యక్తి అయిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో భారతదేశం అధిక సంఖ్యలో కేసులను చూడగలదని, అయితే తేలికపాటి లక్షణాలు కొంతమేర ఉపశమనం కలగించవచ్చు అని పేర్కొన్నారు .