
భారత కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ డా.వి.కె.పాల్ మాట్లాడుతూ, “కొత్త 183 కేసులలో, తొంబై ఒక్క శాతం రెండు డోస్ ల వాక్సిన్ వేసుకోగా , 7 మంది వ్యక్తులకు టీకాలు వేయబడలేదు మరియు ఇద్దరు పాక్షికంగా టీకాలు వేసుకున్నారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, 27 శాతం కేసులు లోకల్ ట్రాన్స్మిషన్ కారణంగా ఉన్నాయి.
డెల్టా మరియు ఒరిజినల్ వేరియంట్ కంటే ఓమిక్రాన్ ఎక్కువ వ్యాప్తి చేయగలదని డాక్టర్ కె.ఎ పాల్ పేర్కొన్నారు. సరైన కోవిడ్ భద్రతా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు .రాబోయే పండుగల కారణంగా, కేసులు పెరగవచ్చు అని పేర్కొన్నారు
డేటా ఆధారిత విశ్లేషణలు, దూరదృష్టి, ఆడిట్‌లు మరియు బెడ్‌ల లభ్యతతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మొత్తం ఆరోగ్య వ్యవస్థను సిద్ధం కావాలని కూడా ఆయన సూచించారు.
ప్రధాన మంత్రితో గురువారం జరిగిన సమీక్ష సందర్భంగా ఆయన జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలను నొక్కి చెప్పారని అయన పేర్కొన్నారు . ప్రస్తుతం ఉన్న ఏకైక ఉపశమనం మెజారిటీ ఓమిక్రాన్ కేసులలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు.భారతదేశంలో మొత్తం 358 కేసులలో, 114 పూర్తిగా కోలుకున్నారని , ఆరు రాష్ట్రాల్లో 30 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయని ఆరోగ్య మిస్ట్రీ తెలిపింది.
వాసకి