
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో ప్రజలు గుమ్ముగూడటం పై నిషేధం విధించాలని తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అధికారుల సహకారంతో త్వరితగతిన మార్గదర్శకాలను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ ఎన్. తుకారాంజీ ప్రజా ప్రయోజనాల కోవిడ్ 19పై దాఖలైన పిటిషన్లను విచారించారు.
ఇతర దేశాల నుంచి వచ్చే వారిని తనిఖీ చేసేందుకు ఎయిర్పోర్టులో పక్కా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఓమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్నందున, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు సూచించింది.
వాసకి