
రెండు రోజుల్లో రెండు భయంకర సంఘటనలు, స్వర్ణ దేవాలయంలో సిక్కుల మత జెండాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని అక్కడ ఉన్న గుంపు కొట్టి చంపారు మరియు కపుర్తలా జిల్లా నిజాంపూర్ గ్రామంలో మరో సంఘటనలో చపాతీ దొంగిలించినందుకు వ్యక్తిని కొట్టి చంపారు. గురుద్వారా ఆకలితో ఉన్న ప్రజలందరికీ, అక్కడ ఉన్న లంగర్లు ఉచితంగా భోజనం పెడతాయి . గురుద్వారా వద్ద ఉన్న వ్యక్తులు “ఈ వ్యక్తి మన ఆహారాన్ని దొంగిలిస్తున్నాడు” అని అరుస్తూ, గుంపు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాలలో ప్రసారం అవుతున్నాయి.
మృతుడు బీహార్‌కు చెందిన కూలీ అని , మానసిక స్థితి సరిగా లేదని సమాచారం.
వాసకి