
బిజెపి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గంగా ఎక్స్‌ప్రెస్‌వే కు శనివారం పునాది వేస్తూ, యోగి గొప్ప నాయకుడని మోడీ అభినందించారు
యోగి యూ.పి లో మాఫియాను అంతమొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి గత 4.5 సంవత్సరాలుగా శాంతిభద్రతలను చక్కదిద్దిన ఘనత ఆయనదే అని అన్నారు .
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేధిలో మాట్లాడుతూ, పెద్ద ఎత్తున నిరుద్యోగానికి ప్రధాని మోదీయే కారణమని అన్నారు. డీమోనిటైజేషన్, తప్పుడు జీఎస్టీ అమలు వంటి కొన్ని కీలక నిర్ణయాలు భారీ నష్టాలకు దారితీశాయి అని పేర్కొన్నారు . నిరుద్యోగం మరియు ద్రవ్యోల్బణం ఇప్పుడు దేశానికి రెండు ప్రధాన సమస్యలని, వాటికి మోడీ సమాధానం చెప్పలేడని ఆయన పేర్కొన్నారు.తరువాత, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ అమేథీలో ‘జన్ జాగరణ్ అభియాన్’ పాదయాత్రకు నాయకత్వం వహించారు
వాసకి