21 సంవత్సరాల పంజాబ్ కి చెందిన హర్నాజ్ సంధు, ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత మళ్ళి భారత్ గూటికి విశ్వ సుందరి కిరీటాన్ని చేర్చింది . లారా దత్తా భారత్ తరుపున చివరిన 2000 సంవత్సరంలో విశ్వ సుందరి కిరీటాన్ని గెల్చుకుంది .
ఇజ్రాయెల్ లోని ఐలెట్ ప్రాంతంలో జరిగిన ఈ పోటీల్లో, పరాగ్వే ,సౌత్ ఆఫ్రికా కు చెందిన పోటీదారులను వెనక్కి నెట్టి విశ్వ సుందరి కీరిటాన్ని గెల్చుకుంది హెర్నాజ్ .2020 విశ్వ సుందరి విజేత ఆండ్రియా మేజా ఈ కీరిటాన్ని హెర్నాజ్ సంధు కి బహుకరించింది .
“ఈ రోజుల్లో అమ్మాయిలు ఎదుర్కొంటున్నా ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి “అనే ప్రశ్నకు సమాధానమిస్తూ “ఒత్తిళ్లను ఎదుర్కోవాలంటే తమను తాము నమ్ముకోవాలి అని ,ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి విశాల దృక్పధాన్ని పెంచుకోవాలి అని ,మన జీవితానికి మనమే మార్గ
నిర్ధేశుకలమని, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయాలని సందేశమిచ్చారు .
వాసకి
