అందరు ఊహించినట్టే వన్ డే మ్యాచ్ పగ్గాలు కూడా రోహిత్ కే అప్పగించారు . ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ రోజు జరిగిన మీటింగులో ఇండియా -దక్షిణ ఆఫ్రికా టెస్ట్ టీం ని ప్రకటించారు .రోహిత్ ని వన్డే కెప్టెన్ గా ప్రకటిస్తూ ,అలానే టెస్ట్ లో కూడా రహానే స్తానం లో వైస్ కెప్టెన్ పగ్గాలు రోహిత్ కే అప్పగించారు .
వన్డే ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న రోహిత్ గత కొన్ని సంవత్సరములలో అద్భుత ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పటికే I.P.L లో ఐదు కప్పుల అందించిన సారధిగా నిలిచాడు.కోహ్లీ గత కొద్దీ కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడటమే కాక ,కెప్టెన్సీ లో కూడా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు . కానీ చాల సందర్భాల్లో హాట్ ఫేవరెట్ గ బరిలో దిగినప్పటికీ చివరి అంకెల్లో బోల్తా పడ్డారు ,కెప్టెన్ గా ఐ.సి.సి కప్ లు గెలవనపటికి ,ఎన్నో సందర్భాల్లో ముందు ఉండి నడిపించాడు . 2016 టీ 20 తీసుకున్నా ,2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ,2019 వరల్డ్ కప్ ,2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ,ఇలా చాలా వరకు టీం బాగానే ఆడినప్పటికీ ,చివరి అంకెల్లో బోల్తా పడ్డారు ఏది ఏమైనా ఇప్పటికైనా సమిష్టిగా రాణించి 2013 లో గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ తో ఆగిపోయిన భారత ట్రోఫీ ల కల ఇప్పటికైనా నెరవేరుతుందని ఆశిద్దాము.
వాసకి