ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇక లేరు ! Share tweet రాజకీయ దురంధరుడు ,ప్రజ్ఞాశాలి ,మంచి మాటకారి అయిన రోశయ్య ఇక లేరు . పద్నాలుగు సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనది . వై.ఎ స్.ఆ ర్ మరణం తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎన్నో సవ్వాళ్లు ఎదుర్కొన్నారు . కర్నూల్ వరదలప్పుడు ఆయన చూపిన చొరవ చాల గొప్పది ,రాత్రి పగలు పర్యేవీక్షిస్తూ నాగార్జున సాగర్ డ్యామ్ కు వరద వల్ల ఏర్పడిన ప్రమదం తొలగించారు . వై .ఎస్ .ఆర్ మద్దతుదారుల వ్యతిరేకత ఆయనకు చాలా ఇబ్బంది గురి చేసింది అని అయిన ఒక్క ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ఎయిర్పోర్ట్స్ లో ,ప్రజల్లో కి వెళ్ళినప్పుడు కూడా తనకు ఇబ్బంది ఎదురుదైందని జగన్ స్థానాన్ని నేను తీసుకున్నాని ,అది వెంటనే వదిలేయాలి అని డిమండ్ లు వచ్చేవి అని , తాను హై కమాండ్ ఆదేశాల మేరకు ఈ పదవి తీసుకున్నా అని ,తనకు ఎలాంటి పదవి కాంక్ష లేదని ఒక్కనొక సందర్భంలో మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మంచి వక్త అయిన రోశయ్య సభ లో ప్రత్యర్థులను సమర్ధనగా ఎదుర్కొనేవారు .కె .సి.ఆ ర్ దీక్ష సమయంలో కేంద్రానికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ ,త్వరగా నిర్ణయం వెల్లడించాలి అని ఒత్తిడి తెచ్చారు . ఆ సమయంలో చిదంబరం తెలంగాణకు అనుకూలంగా చరిత్రమిక స్టేట్మెంట్ ఇచ్చారు .అయన 2011 -2016 కాలం లో తమిళనాడు ముఖ్యమంత్రి గ బాధ్యతలు నిర్వర్తించారు . తక్కువ రక్తపోటు కారణంగా అకస్మాత్తుగా నాడి వ్యవస్థ నెమ్మదించడంతో ఆయన తుది శ్వాస విడిచారు . అయన వయసు 88 సంవత్సరాలు .ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు . తెలంగాణ ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగు ప్రకటించింది .