సేవ చేస్తే కష్ట కాలం…..

ఇన్కమ్ టాక్స్ తాజాగా సినిమా యాక్టర్ మరియు శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ ని విచారించింది . 20 కోట్లు వరకు తనకు వచ్చిన డబ్బులను సేవ కార్యక్రమాలకు పెట్టకుండా ఇంకా తన దెగ్గరే ఉంచుకున్నారని ఆరోపించారు .

సోను సూద్ దానికి బదులిస్తూ తాను ఏ ఒక్క డబ్బుని ఉంచుకొనని రాన్నున్న కాలంలో వాటిని ప్రజలకే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు .

ఎన్నో బహుళ జాతి సంస్థలు , వ్యాపారవేత్తలు నుండి సుమారు 72,000 కోట్లు ఇన్కమ్ టాక్స్ సక్రమంగా వసూలు చేసుకోలేక పోతుందని కాగ్ 7 సంవత్సరాలు కిందటే మొట్టి కాయలు వేసింది . కానీ , కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ప్రజలకు ఈ కరోనా కష్టకాలంలో  ఎంతో సేవ చేసిన సోను సూద్ ని మాత్రం విచారించడం శోచనీయమని  ప్రజలు అభిప్రాయపడుతున్నారు .ట్విట్టర్ వేదికగా హ్యాష్ట్యాగ్ లతో అతనికి మద్దతు పలుకుతున్నారు . ఐక్య రాజ్య సమితి నుంచి కూడా సత్కారం అందుకున్న సోను సూద్ ని ఇబ్బంది పెట్టడం రాజీకీయ కారణాలు ఉన్నట్లు కూడా అభిప్రాయపడుతున్నారు . దీని ప్రధాన కారణం ఢిల్లీ ప్రభుత్వానికి అతను దెగ్గరగా ఉండడమే అని అభిప్రాయ పడుతున్నారు . అతన్ని ఇటీవలే కేజ్రీవాల్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల  కోసం ” దేశ్ కా మెంటార్ ” అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం గమనార్గం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *