“రాచిన్ ” అద్భుత పోరాటం ,కాన్పూర్ టెస్ట్ డ్రా !

 

 

 

 

 

Kyle Jamieson

భారత్ గెలుపు కోసం ఎదురు చుసిన భారత ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది . నిన్న నాలుగు పరుగులకే 1 వికెట్ నష్టపోయిన న్యూజిలాండ్ ఇవ్వాళ బాగా సానుకూల దృక్పధం తో బాటింగ్ చేసింది . ఎప్పటి లానే కేన్ విలియంసన్ భారత బౌలర్లు ను సమృదంగా ఎదుర్కున్నాడు . మ్యాచ్ డ్రా అనే సమయం లో కేన్ విలియంసన్ అవుట్ అయి భారత శిబిరంలో ఆశలు నింపాడు . వెనువెంటనే భారత్ స్పిన్ త్రయం అశ్విన్ ,జడేజా సమర్థమైన బౌలింగ్ తో విలియంసన్ సేన తొమ్మిది వికెట్లు కోల్పోయి , పీకల్లోతు కష్టాల్లో కూరుపోయింది .
ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ గ అవతరిస్తున్నా న్యూజిలాండ్ తామేంటో మరో సారి చూపించింది . వాళ్ల చివరి వరస బ్యాట్సమెన్ కూడా అద్భుతంగా పోరాడారు . రాచిన్ రవీంద్ర అనే న్యూజిలాండ్ క్రికెటర్ గొప్ప డిఫెన్స్ తో భారత స్పిన్ త్రయాన్ని సమార్డంగా ఎదుర్కున్నాడు . రాహుల్ లోని “రా” “సచిన్”లో చిన్ కలబోతగా తన తండ్రి పెట్టిన పేరును నిలబెట్టుకున్నాడు . అతను 91 డెలివరీ లను సమార్డంగా ఎదుర్కొని భారత్ యొక్క విజయానికి అడ్డుగా నిలబడ్డాడు . రెండు ఇన్నింగ్స్ లోనూ గొప్పగా రాణించిన శ్రేయాస్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గెల్చుకున్నాడు. ఈ మ్యాచ్ డ్రా గ ముగియడంతో న్యూజిలాండ్ నూతన ఉత్సాహంతో రెండవ టెస్ట్ లో భారత్ ను ఎదురుకుంటుంది అనుకోవడంలో సందేహం అవసరం లేదు . విరాట్ రాక తో భారత శిభిరం లో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు . రహానె కెప్టెన్సీ పర్వాలేదనిపించిన స్వదేశంలో బ్యాట్సమెన్ గా పూర్తిగా విఫలం అవుతున్నాడు ,అతను తర్వాత టెస్ట్ లో ఉండడం సందేహమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *