నిన్నటి 58,097 కేసులతో పోలిస్తే భారతదేశంలో 56 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తంమీద, ఓమిక్రాన్ వేరియంట్‌లో మొత్తం 2630 కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్రలో అత్యధికంగా 797 కేసులు, ఢిల్లీలో 465 కేసులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఒక్కరోజులో 5 నుంచి 6 లక్షల కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశం రికవరీ రేటు 98 శాతంగా ఉండటం మాత్రమే ఇప్పుడు ఉపశమనం.
USలో ప్రస్తుతం రోజుకు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి, అయితే మునుపటి వేరియంట్‌లతో పోలిస్తే, ఇది మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది . మునుపటి వేరియంట్‌లతో పోలిస్తే ఇది మరింత నిర్వహించదగినదని మరియు ఆసుపత్రిలో చేరే రేటు చాలా తక్కువగా ఉందని ఆమెరికా లోని నిపుణులు అంటున్నారు. రాబోయే 2 నెలలు చాలా కీలకమని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,టీకా వేసుకుంటూనే అన్ని కోవిద్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు .