ప్రజలు తమను ఎన్నుకుంది అసెంబ్లీ లో బూతులు తిట్టుకోవడానికే అన్నట్టు ఉంది ఆంధ్ర ప్రదేశ్ లో . ఇరుపక్ష నేతలు కొత్త కొత్త తిట్లతో తిట్టుకుంటున్నారు ,బూతుల అర్థాలు కూడా ప్రజలకు వివరిస్తున్నారు . ఒకరు ఏమో ఎప్పుడప్పుడు పాలక పక్షాని తోసేసి తాము గదనేకేద్దామని ఆలోచిస్తున్నారు ,అధికార పక్షమేమో నానా పాట్లు పడుతూ సంక్షేమ కారక్రమాలు పరంవీధిగా సాగుతున్నారు . అధికార పక్షం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్షేమం కు పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వై.ఎ స్.ఆర్ ని గుర్తు తెచ్చుకోవడమే .
ఫ్రెండ్లీ పాలిటిక్స్ కి తెర లేపింది కూడా వై.ఎ స్.ఆర్ అ నే గుర్తు తెచ్చుకోవాలి . ఈటెల వంటి వారు కూడా వై.ఎ స్.ఆర్ ని ప్రశంసిస్తూ తాము ప్రతిపక్షం లో ఉన్నా తమ నియోజకవర్గ పనులు గురుంచి వెళ్తే తమ సమస్యకు సత్వర పరిష్కారం చూపేవారని గుర్తుచేసుకున్నారు . ఇప్పటికైనా బూతులు పక్కకి పెట్టి , ప్రతిపక్ష నాయకుడిని మామ ని వెన్ను పోటు పొడిచావని ఎప్పుడు విమర్శిస్తుంటే జనాలకు కూడా ఇబ్బంది గా ఉంటుంది . నిజంగా జనాలకు అది కాదు కదా కావాల్సింది ,కరోనా ని ఎంతో సమర్ధనగా ఎదుర్కొన్న ఏ .పి ప్రభుత్వం ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టిపెట్టి ప్రతి పక్షం రెచ్చగొట్టిన చెదరకుండా ప్రజల మన్నెలను పొందితే బాగుంటుంది .
వాసకి
