పరంపర సమీక్ష

Parampara

శీర్షిక: పరంపర వెబ్ సిరీస్
తారాగణం: R. శరత్ కుమార్, జగపతి బాబు, నవీన్ చంద్ర, మురళీ మోహన్, ఆమని, కస్తూరి, నైనా గంగూలీ, మరియు ఇతరులు.
దర్శకుడు: కృష్ణ విజయ్ ఎల్.
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
రేటింగ్: 2.5 / 5

సమీక్ష: చిత్రం మురళీ మోహన్ పరిచయం మరియు అతని ఇద్దరు కుమారులు జగపతి బాబు మరియు శరత్ కుమార్‌తో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం మురళీ మోహన్‌ను మానవతావాదిగా చూపెడుతూ మరియు అతని వారసత్వాన్ని అతని కుమారులు అనుసరించాలని అక్షించే క్యారెక్టర్ . మొదటి రెండు ఎపిసోడ్‌లు చాలా ఆసక్తికరంగా మరియు క్యూరియాసిటీని పెంచాయి. నవీన్ చంద్ర క్యారెక్టర్ ఎన్నో ఎత్తుపల్లాలను మెయింటెన్ చేస్తుంది. నాయుడుగా శరత్ కుమార్ అద్భుతంగా ఉండగా, మోహన్ రావుగా జగపతిబాబు ఓకే. వెబ్ సిరీస్ యొక్క కాస్టింగ్ బాగుంది, రైటింగ్ విభిగంలో మాత్రమే సమస్య ఉంది. ప్రారంభ భాగం నాయుడుని నెగటివ్ పాత్రగా చిత్రీకరిస్తుంది మరియు సిరీస్ ముందుకు సాగుతున్న కొద్దీ నాయుడు పాత్రలో మనం సానుకూలతను చూస్తాము మరియు జగపతి బాబు పట్ల జాలిపడతాము. మోహనరావుని ఉన్నత స్థానంలో చూడాలనుకునే నవీన్ చంద్ర క్యారెక్టర్ నాయుడుపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. గోపి మరియు నాయుడుల మధ్య జరిగే సంఘర్షణ కధే ఈ పరంపర. ఎమోషనల్ గ ఎక్కడ కనెక్ట్ అవ్వము . మోహన్‌రావు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాయుడుగారి కన్నీళ్లు మాత్రమే ప్రేక్షకులకు ఉద్వేగభరితమైన సందర్భం .

చివరి గమనిక: కధ లో ఎమోషన్ పాయింట్స్ ఎక్కడ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *