ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరహో !!! Share tweet KKR తో జరిగిన ఎలిమినేటర్ లో ఢిల్లీ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసింది .ఆ జట్టు ఓడినా కూడా ఒక అద్భుతం కొంచంలో చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన DC 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది .హీత్మ్యేర్ చివరినా కొట్టిన 2 సిక్సలూ వాళ్ళ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది .డీసీ ఇబ్బంది పడిన పిచ్ మీద KKR తమ మొదటి పది ఓవర్లు లోనే మ్యాచ్ తమ చేతులోకి తీసేసుకుందీ. కాని ఆఖరి 5 ఓవర్లు మాత్రం రబడా ,నోకియా కట్టుదిట్టమైన బౌలింగ్ తో లాస్ట్ ఓవర్ కి 7 పరుగులు అవసరం అయ్యాయి. అశ్విన్ చివరి ఓవర్ మిగిలి ఉండడంతో అతనికి బంతి అందించాడు పంత్ . ఆ ఓవర్ లోనే 2 వికట్లు తీయడంతో డీసీ పట్టు బిగించింది . 2 బంతులు 6 పరుగులు చేయవలసిన స్థితి లో రాహుల్ త్రిపాఠి ఒక అద్భుతమైన సిక్స్ కొట్టాడు. దీంతో మ్యాచ్ KKR వశమైంది . కానీ ఎంతో ముందుగా ప్లేఆఫ్ కి చేరిన డీసీ ,ఈ సారి కప్పు రాకపోయినా గొప్ప టీం గా పేరు గడించింది . రిసబ్ పంత్ చిన్న వయసులో నే ఒక గొప్ప నాయకుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు .