టైటిల్ : ఒక్క చిన్న ఫామిలీ స్టోరీ
నటి నటులు : సంగీత్ శోభన్ , సిమ్రాన్ శర్మ ,నరేష్ ,రాజీవ్ కనకాల ,తులసి ,గెటప్ శ్రీను
డైరెక్టర్ : మహేష్ ఉప్పాల
ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల
రివ్యూ : మధ్య తరగతి యొక్క ఆలోచన విధానం , ఒక తండ్రి పిల్లలు కోసం పడే ఆవేదన , అప్పులు కట్టడానికి ఒక కుటుంభం పడే వ్యధ ,అన్ని కలిపి ఒక్క ఫామిలీ స్టోరీ ని చేసింది . దర్శకుడు ఒక్క సున్నితమైన కథను తీసుకొని, మంచి స్క్రీన్ ప్లే తో ఈ యొక్క వెబ్ సిరీస్ ను నడిపించడంలో విజయం సాధించాడు . తులసి అమాయకపు తల్లి పాత్రలో జీవించేసారు,నరేష్ పాత్ర చిన్నదే అయినా కధ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది . సంగీత్ శోభన్ పాత్ర పరిధిలో నటించాడు అనే దానికన్నా జీవించాడు అని చెప్పొచ్చు.
తండ్రి చనిపోయాక ఒక్క కుటుంబం పడే ఆర్థిక ఇబ్బందులు సున్నితంగా వివరించారు . కొడుకు గ సంగీత్ శోభన్ తండ్రి చేసిన అప్పును తీర్చడానికి పడే ఇబ్బందులు , తులసి తన అమాయకపు చేష్టలు నవ్వు తెప్పిస్తుంది . తండ్రి ని ద్వేషించే పాత్ర చివరికి తండ్రి యొక్క గొప్పతనం తెలుసుకునేవరకు ఎత్తుపల్లాలు లేకుండా సాగిపోతుంది . హీరోయిన్ గ చేసిన సిమ్రాన్ బాగా నటించినప్పటికీ పాత్ర తీరు ఇంకా ఆ పాత్ర సాగదీత కొంచం మధ్యలో సాగదీసినట్టుగా అనిపిస్తుంది . ఇదొక్కటి మినహాయిస్తే సినిమా మాత్రం ఒక్క ఫామిలీ మొత్తం చూడగలిగేది .
రేటింగ్ : 3/5
వాసకి