జనసేన అధినేత పై పోసానికృష్ణ మురళి పరుష పదజాలంతో మాట్లాడారు . రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన మాటలు ఉటంకిస్తూ పోసాని తన స్థాయి తగని మాటలు మాట్లాడారు . మాటల రచయిత మరియు నటుడు అయిన పోసాని తనను పవన్ అభిమానులు దూషిస్తున్నారని,అ నకూడని మాటలు అంటున్నారని విమర్శించారు . ఇలా చెప్పుకోవటంలో తప్పు లేదు . పవన్ అభిమానులు ను కూడా తిట్టచ్చు కానీ అభిమానులు తన భార్యను,పిల్లలను తిడుతున్నారని పోసాని కూడా అనకూడని మాటలు అన్నారు .
అభిప్రాయబేధాలు ఉండటంలో తప్పు లేదు ,కానీ ఏది పడితే అది మాట్లాడితే నే సమస్య . పవన్ ఒక మంత్రిని విమర్సించచు కానీ అతను కూడా ఒక పదం వాడారు .కానీ అది తన బాధ వ్యక్తపరిచే క్రమంలో వాడి ఉండచ్చు . ఆ మంత్రి కూడా ఆ పదానికి అర్ధం చెప్పి తానూ ఆ కులస్థుడిని అని పవన్ ని వ్యక్తిగత దూషణలు మొదలు పెట్టారు . తమ అధినేత మెప్పు పొందాలో ఏమో అని ఆ పార్టీ ఇతర మంత్రులు.నాయకులూ కూడా పవన్ ను దూషించడం మొదలు పెట్టరు.పోసాని ఒక అడుగు ముందుకేస్తూ ఎవరో పంజాబీ అమ్మాయ కి న్యాయం చేయాలని పవన్ దానికి ముందుకు రావాలని ఆరోపిస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు . ప్రజా నాయకులు ,సినీ పెద్దలు జన సమస్యలు మాట్లాడుకుంటే తప్పు లేదు కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటుంటే అది చాలా నీచంగా ఉంటుంది .ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మాని ప్రజా సమస్యలు మాట్లాడుకుంటే జనాలు కూడా హర్షిస్తారు.
వాసకి
