“పేరు గొప్ప ఊరు దిబ్బ” ల తయారైంది టీం ఇండియా పరిస్థితి .

ఏదో అనుకుంటే ఏదో అయింది . ఐపీల్ చూసి టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ తో ఎవరు తల పడతారో అని ఊహించుకున్నారు అభిమానులు . ధోని మెంటార్షిప్ ,విరాట్ సారథ్యం,కే.ఎల్ రాహుల్ అద్భుత ఫామ్ ,రోహిత్ అండ చూసి భారత్ కు తిరుగు లేదు అనుకున్నారు . ఈ ముచ్చట రెండు మ్యాచ్లతో ముగిసింది . పాకిస్థాన్తో అన్న గౌరవప్రద ప్రదర్శన చేసింది ,మొదట టప టప వికెట్లు రాలిన విరాట్ అండతో 150 అన్న దాటించగలిగింది . న్యూజిలాండ్ తో మరి గొరంగా అతి కష్టం మీద 100 పరుగులు దాటించగలిగింది . టీ 20 కాస్తా టెస్ట్ మ్యాచ్ ల అనిపించింది .
అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషకులు కూడా అంతుపట్టని విషయం . ఒక సారి ఏమో అద్భుతంగా ఆడుతున్నారు ,కీలకమైన టౌర్నమెంట్లలో సమిష్టిగా చేతులు ఎతేస్తున్నారు . కాగితం మీద సింహాలు ల అనిపించే ఆటగాళ్లు మైదానం లో పిల్లు ల అయిపోతున్నారు . పెద్ద టోర్నమెంట్లంటే ఒక తెలియని భయం విరాట్ సేన లో స్పష్టంగా కనిపిస్తుంది . కోహ్లీ ఒక్కడినే తప్పు పట్టలేం కానీ అతని ఆట మాత్రం నానాటికి తీసికట్టు ల తయారవుతుంది . కెప్టెన్సీ ఒక్క ప్రభావమో ఏమో గాని ఎప్పుడు ముందు ఉండి నడిపించే అతను కూడా కీలక సందర్భాల్లో తటపటాయిస్తున్నడు .
ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో దాదాపు భారత్ ఆట ముగిసింది , ఏదో అద్భుతం జరిగితే తప్ప భారత్ సెమిస్ కు చేరలేదు. ఇప్పటికైనా I.P.L ప్రకారంగా కాకుండా నాణ్యమైన ఆటగాళ్లను ఆడించి ,ఆల్ రౌండర్ లకు పెద్ద పీత వేస్తే కొద్దీ వరకు ప్రయోజనం ఉంటుంది . కెప్టెన్సీ లో కూడా సాయమైనంత త్వరగా టీ 20 మరియు ODI ప్లేస్ పగ్గాలు రోహిత్ కి ఇస్తే ,విరాట్ కూడా బాటింగ్ లో గాడిలో పడవచ్చు . రవి శాస్త్రి మాత్రం ఒక పేలవమైన కోచ్ గా మిగిలిపోతాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *