సీసనల్ పొలిటికల్ అనలిస్ట్ గ పేరు తెచ్చుకున్న ఉండవల్లి మీడియా ముందు ఈరోజు ప్రత్యక్షమయ్యారు . ఎవరి వైపు మాట్లాడతారో ఎప్పుడు అంతు పట్టని ఈ మాజీ ఎం.పి గారు ఆంధ్ర రాజీకీయాలు గురుంచి మాట్లాడారు .
నందమూరి కుటుంభం గురుంచి 1970 ల నుంచి తెలుసని ,ఎప్పుడు కూడా ఆ ఇంటి ఆడవారి మీద ఎలాంటి పుకార్లు లేవని ,తనకు ఆ కుటుంబంలో హరికృష్ణ మరియు పురందరేశ్వరి తెలుసనీ ,అందరూ బాగా మర్యాదస్తులని చెప్పుకొచ్చారు .కొడాలి నాని గురుంచి మాట్లాడుతూ ఒక కధ చెప్పి పిచోడు అనే మాటలు పట్టించుకుంటామా అని చంద్రబాబు ని ఉద్దెశించి అన్నారు .చంద్రబాబు సానుభూతి కోసం ఇది చేసారని అనుకోనని ఎందుకంటే సానుభూతి తో ప్రయోజనం ఉండదని చంద్రబాబు యొక్క నక్సలైట్ బ్లాస్ట్ తర్వాత జరిగిన ఎన్నికలను ఉదాహరణగా చెప్పారు ,అలాగే ఎన్టీఆర్ చంద్రబాబు గురుంచి చెప్పినప్పుడు సానుభాతి పొందాలని చూసారని అదికూడా ప్రయోజనం చేకూర్చలేదని చెప్పారు . రాష్ట్రం అప్పుల కుప్ప ల తయారవుతుందని ,అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగట్లేవని ,ఇలానే కొనసాగితే ఎంతో మెజారిటీ తో గెలిచినా ప్రజలు మళ్ళి సారి అవకాశం ఇవ్వాలంటే ఆలోచిస్తారని హెచ్చరించారు.
వాసకి
