నాగాలాండ్ లో మారణకాండ ! Share tweet పనులు చేసుకొని తిరుగు ప్రయాణమవుతున్న కూలీలను ,నిషేదిత ఉగ్రవాదులు అనుకోని పారామిలిటరీ సిబ్బంది కాల్పులు జరిపారు . ఈ కాల్పుల్లో 6 మంది మరణించారు . మయన్మార్ సరిహద్దులోని మోన్ జిల్లాలో ఈ కాల్పులు జరిగాయి ,నిషేదిత ఉగ్రవాదులు ఎన్ఎస్ సీఎన్ (కె) సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పారా మిలిటరీ లోని ఒక యూనిట్ ఆ ప్రాంతంలో వెళ్తున్నా ఒక్క వాహనం పై అకస్మాత్తుగా కాల్పులు జరపడం ప్రారంభించారు . ఎంతకీ కూలిలు ఇంటికి చేరకపోవడంతో వారి కుటుంభ సభ్యులు, సంఘటన గురుంచి తెలుసుకొని కోపోద్రిక్తులయ్యారు . వందల మంది సంఘటన స్థలానికి చేరుకొని సైనికుల మీద దాడి చెయ్యడం ప్రారంభించారు .ఆత్మసంరక్షణ కోసం సైనికుల జరిగిన కాల్పుల్లో ఇంకో ఎనిమిది మంది మరణించారు ,ఎంతో మంది గాయబడ్డారు . సైనికుల్లో ఒకరు మరణించారు .మరణించిన సామాన్యుల సంఖ్యా ఇంకా పెరగవచ్చని సమాచారం . ఈ సంఘటనకు ప్రధాని మోడీ ,అమిత్ షా , రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ,రాహుల్ గాంధీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తపరిచారు . ఈ సంఘటనతో సైన్యం విచారణకు ఆదేశించింది .