దక్షిణాఫ్రికా లో వెలుగు చూసిన కరోనా వైరస్ ముమ్మరంగా విస్తరిస్తుంది . ఇప్పటకే బోట్స్వానా ,దక్షిణాఫ్రికా ల నుంచి ప్రయాణాలు రద్దు చేశారు . అమెరికా , రష్యా ,జపాన్ ,ఆస్ట్రేలియా ,బ్రిటన్ దేశాలు పలు ఆఫ్రికా దేశాలు నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధించాయి . చాలా మంది ప్రయాణికులు అత్యవసర ఆంక్షలు వల్ల విమానాశ్రయాలు లో చిక్కుకు పోయారు . బ్రిటన్,జర్మనీ దేశాలలో ఇప్పటికే పలు కేసులు మొదలయ్యాయి .
బెంగుళూరు లో కూడా దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన ఇద్దరికీ కరొన వైరస్ సోకడంతో కలకలం మొదలైంది ,తర్వాత పరీక్షించి ఓమిక్రాన్ వేరియంట్ కాదని నిర్దారించారు . ప్రధాని మోడీ రెండో డోస్ వేగాన్ని పెంచాలని సూచించారు . భారత్ లో కూడా విమానాశ్రయాల్లో కూడా ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి కోరంటైన్ అవ్వాలని ఆదేశించారు .ఇప్పటికే వైరస్ ప్రభావిత ప్రాంతాలు నుంచి వచ్చిన వారిని మళ్ళి పరీక్షిస్తున్నారు . బెంగుళూరుకే సుమారు 600 మంది వచ్చినట్లు సమాచారం .ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా కష్టపడి ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి బయటపడుతున్నామని ,ఈ సమయంలో వైరస్ ప్రభావిత దేశాలు నుంచి వచ్చేవారిని నిషేదించాలని సూచించారు .
వాసకి
