Thursday, 24 September 2026
వాసకి

సామాజిక రాజకీయ సంపూర్ణ మానవ పత్రిక

తాజా వార్తలు
ట్రెండ్స్

ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరహో !!!

Risabh Pant

KKR తో జరిగిన ఎలిమినేటర్ లో ఢిల్లీ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసింది .ఆ జట్టు ఓడినా కూడా ఒక అద్భుతం కొంచంలో చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన DC 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది .హీత్మ్యేర్ చివరినా కొట్టిన 2 సిక్సలూ వాళ్ళ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది .డీసీ ఇబ్బంది పడిన పిచ్ మీద KKR తమ మొదటి పది ఓవర్లు లోనే మ్యాచ్ తమ చేతులోకి తీసేసుకుందీ. కాని ఆఖరి 5 ఓవర్లు మాత్రం రబడా ,నోకియా కట్టుదిట్టమైన బౌలింగ్ తో లాస్ట్ ఓవర్ కి 7 పరుగులు అవసరం అయ్యాయి. అశ్విన్ చివరి ఓవర్ మిగిలి ఉండడంతో అతనికి బంతి అందించాడు పంత్ . ఆ ఓవర్ లోనే 2 వికట్లు తీయడంతో డీసీ పట్టు బిగించింది . 2 బంతులు 6 పరుగులు చేయవలసిన స్థితి లో రాహుల్ త్రిపాఠి ఒక అద్భుతమైన సిక్స్ కొట్టాడు. దీంతో మ్యాచ్ KKR వశమైంది . కానీ ఎంతో ముందుగా ప్లేఆఫ్ కి చేరిన డీసీ ,ఈ సారి కప్పు రాకపోయినా గొప్ప టీం గా పేరు గడించింది . రిసబ్ పంత్ చిన్న వయసులో నే ఒక గొప్ప నాయకుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు .

WhatsApp Facebook X

మీ అభిప్రాయం రాయండి